News January 18, 2026
మన మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న పంట

మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంటను శాస్త్రీయ వంగడాలతో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్‌లో సుమారు 78 ఎకరాలలో శాస్త్రవేత్తలు సూచించిన నూతన వంగడాల సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక దిగుబడి సాధించినట్లయితే, వివిధ రకాల శాస్త్రీయ వంగడాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపనున్నారు.
Similar News
News January 23, 2026
జాన్‌పహాడ్‌లో నేడు పవిత్ర ‘గంధోత్సవం’

జాన్‌పహాడ్ సైదులు బాబా ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం శుక్రవారం వైభవంగా జరగనుంది. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంధాన్ని ముజావర్లు గుర్రంపై ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్తారు. ఈ వేడుకను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
News January 23, 2026
ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.
News January 23, 2026
పల్నాడులో ఈ ఆలయాలను సంరక్షించాలి

మాచవరం మండలం రేగులగడ్డ గ్రామంలో ఉన్న పురాతన శిధిల ఆలయాలు హిందూ సనాతన ధర్మానికి చారిత్రక సాక్ష్యాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాలను సంరక్షించి పునరుద్ధరించడం అత్యంత అవసరం. భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


