News March 10, 2025
‘మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందాం’

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధి యాలాల్ మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల 9 నెలల బాబు వశిష్ఠ ‘బైలేరియా అట్రే సై’ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్సకు రూ.22 లక్షలు అవసరమని చెప్పడంతో <<15707873>>దాతల కోసం<<>> తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందామని ఇప్పటికే కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News March 10, 2025
కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
News March 10, 2025
నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
News March 10, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు.