News March 6, 2025
మన హైదరాబాద్ కల్చర్ వేరు!

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
Similar News
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
News October 30, 2025
RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News October 30, 2025
కేశంపేట: భారీ వర్షానికి పాడైన బొప్పాయి తోట

మొంథా తుఫాన్ ప్రభావంతో కేశంపేటలో వ్యవసాయం దెబ్బతింది. తొమ్మిదిరేకులకి చెందిన పంది రామ్ రెడ్డి 4 ఎకరాలలో బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. కాత పూత దశలో ఉన్న బొప్పాయి భారీ వర్షానికి నేలకొరిగింది. రూ.లక్షల పెట్టుబడి పెడితే అంతా నాశనం అయ్యింది సదరు రైతు వాపోయాడు.


