News February 27, 2025

మన HYD కోసం పీఎం మోదీ వద్దకు సీఎం రేవంత్!

image

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను పీఎం ముందుంచారు. ✔️నగరంలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి.✔️ మూసీ పునరుజ్జీవం కోసం కేంద్రం సాయం చేయాలి.✔️ తెలంగాణలో ఒక డ్రైపోర్టు నిర్మించాలి. ✔️ RRR ప్రాజెక్టుకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.✔️ మూసీ, గోదావరి అనుసంధానం కోసం రూ.2,000 కోట్లు కావాలి.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: సుమారు 75 శాతం పోలింగ్ నమోదైన బూత్‌లు నాలుగే!

image

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ మొత్తం 407 బూత్‌లల్లో జరిగింది. కాగా ఇందులో 20-30 శాతం పోలింగ్ నమోదైన కేంద్రం 1 కాగా 71 కేంద్రాల్లో 31-40%, 143 కేంద్రాల్లో 41-50%, 158 కేంద్రాల్లో 51-60%, 30 కేంద్రాల్లో 61-70%, 4కేంద్రాల్లో 71-75% పోలింగ్ నమోదైంది. అయితే 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34కేంద్రాల్లో రహమత్‌నగర్ 16, బోరబండ 13, షేక్‌పేట్ 2, ఎర్రగడ్డ 3 ఉన్నాయి. వీటిల్లో 18చోట్ల మహిళలే అధికంగా ఓటేశారు.

News November 14, 2025

Jubilee By-Election: రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్: జాయింట్ CP

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 14, 2025

BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

image

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్‌పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.