News February 8, 2026

మరణించినవారి ఫొటోలు ఎక్కడ ఉంచాలంటే?

image

చనిపోయిన వారి ఫొటోలను పూజా మందిరంలో దేవుడి పటాలతో కలిపి పెట్టకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది వాస్తురీత్యా తప్పని వివరిస్తున్నారు. ‘మరణించిన వారు ఎంతటి వారైనా దేవుళ్లతో సమానం కాదు. వారి ఫొటోలను యమస్థానమైన దక్షిణ వైపు గోడలకు తగిలించడం మంచిది. వారి ఫొటోలు హాలులో కూడా ఉంచకూడదు. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. శాస్త్రనియమాలను అనుసరించి సరైన దిశలో ఉంచాలి’ అన్నారు. <<-se>>#Vasthu<<>>

Similar News

News February 15, 2026

రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

image

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.

News February 15, 2026

స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు: మమతా మోహన్‌దాస్

image

తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ <<10013472>>మమతా మోహన్‌దాస్<<>> తెలిపారు. ‘ఆ టైంలో ఓ ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని దాచి మోసం చేశాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో ప్రజిత్‌ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు.

News February 15, 2026

తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడిషీయల్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కోర్టు అసిస్టెంట్స్, కోర్టు అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in