News August 24, 2024
మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: ఎస్పీ

నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాల ద్వారా మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సమావేశం నిర్వహించారు. అనంతరం కుటుంబాల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ సంక్షేమానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Similar News
News February 1, 2026
ఆదోని మున్సిపాలిటీలో హాట్ టాపిక్

ఆదోని మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని అధికారులు, నాయకుల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. చైర్ పర్సన్ లోకేశ్వరి బంధువులకు రూ.1.25 కోట్లతో బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను ఇవ్వడంపై చర్చ మొదలైంది. మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై ఆ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ చేస్తే విషయాలు బయటకు వస్తాయి.
News January 31, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్.. సర్వం సిద్ధం: ఆర్ఐవో

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్ఐవో లాలప్ప శనివారం ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థుల కోసం 64 పరీక్షా కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశామన్నారు. ఒకేషనల్ విద్యార్థుల కోసం 17 పరీక్షా కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవీఈవో, డీఈసీలు స్క్వాడ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
News January 31, 2026
ఎమ్మిగనూరుకు సీఎం చంద్రబాబు!

సీఎం చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 3 లేదా 8వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో పర్యటించనున్నట్లు జేసీ నూరుల్ క్వామర్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. సీఎంఓ నుంచి పర్యటన తేదీపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు.


