News October 19, 2025
మరికల్: గత నెల 23న విడుదల.. 8 ఇళ్లలో చోరీ

గత నెల 23న జైలు నుంచి విడుదలై 8 చోరీలకు పాల్పడిన దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికల్ మండలం జిన్నారానికి చెందిన ముద్దంగి భీమేశ్(25) చందానగర్, దుండిగల్, మక్తల్, చైతన్యపురి, హయత్‌నగర్ పలు PSలలో మొత్తం 50కి పైగా కేసులు ఉన్నాయి. రాత్రుళ్లు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, బైక్‌లు ఎత్తుకెళ్లే దొంగగా గుర్తించారు. నిందితుడి నుంచి 2బైక్‌లు, 8 గ్రాముల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News October 21, 2025
స్వాతంత్య్ర సంగ్రామంలో సువర్ణ అధ్యాయం: ఆజాద్ హింద్ ఫౌజ్

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈరోజు ఎంతో కీలకం. 1943లో సరిగ్గా ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, తాత్కాలిక స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. నేతాజీ నాయకత్వంలో వేలాది మంది సైనికులు దేశం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. ‘చలో ఢిల్లీ’ నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయం పుట్టించిన ఈ సైన్యం సాహసాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. *జై హింద్
News October 21, 2025
GNT: సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నం ఉమేష్ చంద్ర

ఉమేష్ చంద్ర IPS స్వస్థలం తెనాలి సమీపంలోని పెదపూడి. నిజాయితీ, ధైర్యసాహసాలకు మారుపేరైన ఆయన ‘సూపర్ పోలీస్’గా పేరు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నంగా నిలిచారు. 33 ఏళ్లకే మావోయిస్టుల తుపాకీ గుండ్లకు నేలకొరిగిన ఉమేష్ చంద్రను నేటికీ ఎంతోమంది స్ఫూర్తిగా భావిస్తారు. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ స్మరించుకుంటున్నారు.
News October 21, 2025
భద్రాద్రి: ఆ విషాదానికి 28 ఏళ్లు..ఎప్పటికీ మర్చిపోలేం

కరకగూడెం ఠాణాపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పినపాక(M) పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997 జనవరి 9న అర్ధరాత్రి సుమారు 100 మంది మావోయిస్టులు కరకగూడెం ఠాణాపై దాడికి పాల్పడి, స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా, పోలీసులు ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు.