News February 3, 2025

మరికల్: చిరుత సంచారం నిజమే..!

image

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.

Similar News

News September 17, 2025

HYD: 5 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు

image

నాగార్జునసాగర్ రింగ్ రోడ్డు- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రాకపోకలు సాగించేవారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో 5 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, RUBల నిర్మాణాలకు GHMC సిద్ధమవుతోంది. TKR కమాన్, ఒమర్ హోటల్, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, DPRలు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు.

News September 17, 2025

HYDలో BRS అధికారంలోకి రావాలని భావిస్తున్నారు: KTR

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఘన విజయం సాధిస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారన్నారు. HYD అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ BRS అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారన్నారు.

News September 17, 2025

MNCL: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే శాఖ నేటి నుంచి నూతనంగా ప్రారంభించిన అమృత్ భారత్ వీక్లీ రైలుకు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. సికింద్రాబాద్ నుంచి బీహార్‌లోని ముజఫర్ పూర్ మధ్య ఈ రైలు నడవనుంది. తక్కువ ఛార్జీలు ఉండే ఈ రైలుతో సామాన్య ప్రజలు, వలస కార్మికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.