News December 14, 2025

మరికల్: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ వినీత్

image

నారాయణపేట జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత పోలింగ్ కేంద్రాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మరికల్ మండల కేంద్రంలో పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లోని 95 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదనపు ఎస్పీ రియాజ్ పోలీసులు ఉన్నారు.

Similar News

News December 17, 2025

బోథ్: అవ్వకు పోలీసు లాఠే చేతి కర్ర.. మానవత్వం చాటుకున్న SP

image

బోథ్ మండల నుంచి సొనాలకు వెళ్తున్న ఒక వృద్ధ మహిళ వాహనం నుంచి కిందపడి తలకు గాయమైంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ తీసుకొని తన వాహనంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అందజేసి, వెంటనే సిబ్బంది సహకారంతో అవ్వకు ప్రథమ చికిత్స చేయించారు. తదుపరి నడవలేని స్థితిలో ఉన్న అవ్వకు పోలీసు లాఠీని అందజేశారు. వెంటనే బోథ్ PHCకి తరలించి మానవత్వం చాటుకున్నారు.

News December 17, 2025

సంగారెడ్డి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.

News December 17, 2025

ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

image

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్‌లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.