News July 10, 2025
మరికల్: Way2News కథనానికి స్పందన.. శ్మశాన మార్గానికి కల్వర్టు

మరికల్ మండల కేంద్రంలోని నాయీ బ్రాహ్మణ <<17016546>>శ్మశాన<<>> వాటికకు నడుము లోతు నీటిలో వెళ్లాల్సిన దుస్థితిపై ఏప్రిల్ 9న Way2Newsలో ప్రచురితమైంది. ఈ కథనానికి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్పందించారు. ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేయడంతో కల్వర్టు నిర్మాణం పూర్తయింది. ఈరోజు ఆమె ప్రారంభించారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News July 10, 2025
పూతలపట్టు: గోడ కూలి మహిళ మృతి

పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో కూలి మృతి చెందింది. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో పని చేస్తూ ఉండగా ఆమెపై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.
News July 10, 2025
BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం!

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీ ముగిసింది.
News July 10, 2025
HCA అధ్యక్షుడికి రిమాండ్

HYD క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు <<17021009>>జగన్మోహన్ రావుతో<<>> పాటు ఐదుగురికి మేడ్చల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాసేపట్లో నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. IPL మ్యాచుల సందర్భంగా అదనంగా 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులను CID నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.