News December 14, 2025

మరికాసేపట్లో..

image

TG: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 415 GPలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 38,350 పోలింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News December 17, 2025

కౌలు రైతులకు రూ.లక్ష రుణం, ఎవరికి రాదు?

image

AP: ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి(DKT), అసైన్డ్‌ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.

News December 17, 2025

మొబైల్ ఫోన్లు కొనేవారికి షాక్!

image

వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ ర్యామ్ కంటే AI సర్వర్ల చిప్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. హైఎండ్ DRAM వంటి కాంపోనెంట్స్ వాడటంతో ఫోన్ల ధరలూ పెరగొచ్చు. ఫోన్లలో 16GB RAM వేరియంట్లు కనుమరుగై గరిష్ఠంగా 12GBకే పరిమితం కావొచ్చు’ అని తెలిపారు. కాగా APPLE తన ఫోన్లపై ₹7వేలు, మిగతా కంపెనీలు ₹2వేల వరకూ పెంచనున్నాయి.

News December 17, 2025

ఈ రెండ్రోజులు శివారాధన చేస్తే?

image

శివారాధనకు నేడు(బుధ ప్రదోషం), రేపు(మాస శివరాత్రి) ఎంతో అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం బుధ ప్రదోష వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఫలితంగా బుధుడి అనుగ్రహంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం, వాక్పటిమ పెరుగుతాయని అంటున్నారు. మార్గశిర మాస శివరాత్రి రోజున చేసే శివ పూజలతో పాపాలు నశించి, కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోష, శివరాత్రి పూజల విధానం, టైమింగ్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.