News August 19, 2024

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి రాక

image

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జలాశయం వద్ద నుంచి గ్రామంలో వరకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా కూటమి నాయకులు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిలకు చేరుకున్నారు.

Similar News

News February 21, 2026

నెల్లూరు జిల్లాలో 6 మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

image

సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్రం మంజూరు చేస్తుంది.

News February 21, 2026

నెల్లూరు : రీల్స్ చూస్తున్నారా జాగ్రత్త…

image

ఈ బిజీ లైఫ్‌లో సెల్‌ఫోన్ ఒక భాగమైంది. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి రీల్స్ చూడటం వ్యసనంగా మారుతుంది. రీల్స్ చూడటం వల్ల సామాజిక మాధ్యమాలలో పరిచయాలు జీవిత లక్ష్యాలను పెడదోవ పట్టిస్తున్నాయి. రీల్స్ వల్ల విద్యార్థులు చదువును పక్కనపెట్టి ప్రేమ వ్యవహారాలకు ఆకర్షితులై అదృశ్యమైన వారి సంఖ్య ఎక్కువవుతోంది. తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 21, 2026

కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.