News May 2, 2024
మరికొద్ది సేపట్లో శ్రీకాకుళం జిల్లాకు పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News September 12, 2025
శ్రీకాకుళం: 27 వరకు ప్యాసింజర్ రద్దు

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.
News September 12, 2025
SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
News September 11, 2025
నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.