News December 29, 2025

మరిన్ని మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా.!

image

కొత్త తిరుపతి జిల్లాలో ఇక నుంచి <<18703773>>36<<>> మండలాలు ఉండనున్నాయి. ఇది వరకు 34 ఉండగా కొత్తగా అన్నమయ్య నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని( 5 మండలాలు) తిరుపతి జిల్లాలో కలిపారు. మరోవైపు గూడూరు నుంచి మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో 36 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

Similar News

News December 30, 2025

రాష్ట్రంలో 198 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

TGSRTCలో 198 ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి TGPRB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా, BE, బీటెక్ అర్హతగల వారు నేటి నుంచి JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫిజికల్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 30, 2025

ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రాకుండా ఉండాలంటే..

image

ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. ముందునుంచే ఫిట్స్ ఉంటే గర్భం దాల్చిన తర్వాత న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించాలి. లేకపోతే ఈ సమయంలో ఫిట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఫిట్స్‌కు వాడే మందులు గర్భంతో ఉన్నప్పుడు కొందరు మానేస్తూ ఉంటారు. ఇలా చేస్తే తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రమాదమే.. కాబట్టి డాక్టర్ సూచనలతో బిడ్డకు హాని కలిగించని మందులను మాత్రమే వాడాలి.

News December 30, 2025

వేంకటేశ్వర స్వామి పల్లకి సేవలో మంత్రి దామోదర్

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం మీదుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవను స్వయంగా ఉరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు.