News March 19, 2025
మరిపెడ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మరిపెడ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లంపేట గ్రామానికి చెందిన బత్తెం శ్రీను- కళమ్మ దంపతుల పెద్ద కుమారుడు బత్తెం అజయ్(21) గ్రామంలోనే ఉంటూ విద్యుత్ శాఖలో ప్రయివేటు హెల్పర్‌గా మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎల్లమ్మ పండగ చేయగా మంగళవారం రాత్రి సమయంలో కరెంట్ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు.
Similar News
News December 21, 2025
బాపట్ల: కూలి పనులకెళ్లి యువకుడి మృతి

నల్గొండలోని చిట్యాల శివారు ఉరుమడ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పురిమిట్ల అక్షయ్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకొల్లు నుంచి మునుగోడుకు వెళ్లిన అక్షయ్, తన భార్యతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News December 21, 2025
జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభం

ధర్మవరం ఆర్డీటీ మైదానంలో ఆదివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో ఇంఛార్జ్ హరీష్ బాబు పోటీలు ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ధర్మవరం ఉపాధ్యాయులు జట్టు రాష్ట్రస్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి పాల్గొన్నారు.
News December 21, 2025
NTR జిల్లాలో త్వరలో ‘ఆంధ్రా టాక్సీ’ సేవలు

ప్రైవేట్ క్యాబ్ సంస్థల అధిక ఛార్జీల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ‘ఆంధ్రా టాక్సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకే ఆటో, టాక్సీ సేవలు అందించడమే లక్ష్యంగా NTR జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనున్నారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో నడిచే ఈ యాప్ వల్ల పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సులభతరం కానుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.


