News November 6, 2025
మరిపెడ: ACBకి చిక్కిన AEO

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
ఫెనాల్టీ, వడ్డీని ఎత్తివేయాలి : రైస్ మిల్లర్స్ అసోసియేషన్

డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25%ఫెనాల్టీ, 12%వడ్డీని వెంటనే ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. అధికారుల ఒత్తిడి, అరెస్టు చేస్తారనే భయంతో కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో రైస్ మిల్లు యజమాని స్వప్న ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మావోయిస్టులకు కోట్ల రూపాయల పునరావాసం ఇస్తున్న ప్రభుత్వం రైస్ మిల్లర్లపై కనికరం చూపకపోవడం దారుణమన్నారు.
News March 6, 2026
ADB: రైతు భరోసా ఇంకెప్పుడు?

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కోసం రైతాంగం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. 2025-26 గాను ప్రభుత్వం కేవలం ఖరీఫ్ సాయం మాత్రమే అందించింది. రబీ సీజన్‌కు సంబంధించి గత OCTలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నా నేటికీ అతీగతీ లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.83 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ADB 4.85, NRML 4.23, MNCL 2.46, ASF 3.25తో కలిపి మొత్తం సుమారు 14.79 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతున్నాయి.
News March 6, 2026
NZB: అభివృద్ధిలో స్నేహపూరిత పోటీ తత్వం ఉండాలి: షబ్బీర్ అలీ

అభివృద్ధిలో ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల మధ్య స్నేహపూరిత పోటీ తత్వం ఉండాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్‌లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ ఉమ్మడి జిల్లాల ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాలకు సంబంధించిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


