News January 25, 2025
మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం
గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 27, 2025
వరంగల్ రోడ్డులో కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
ఖమ్మం, వరంగల్ రోడ్డులోని బెటాలియన్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి బొల్లికుంటకు వెళ్తున్న కారు నల్లబెల్లి నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 27, 2025
గీసుగొండ: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి
గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో బాలుడు నీటి సంపులోపడి మృతి చెందాడు. CI మహేందర్ కథనం ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి శాయంపేటలోని తల్లిగారింట్లో నివాసం ఉంటుంది. ఆదివారం శుభశ్రీ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించకపోవడంతో గాలించింది. కాగా ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో చనిపోయి కనిపించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
News January 26, 2025
రోడ్డు ప్రమాదంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు
వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.