News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 8, 2026

SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SPMCIL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్(సైబర్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com

News February 8, 2026

తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

image

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్‌లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్‌స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.

News February 8, 2026

T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

image

ముంబై: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.