News January 2, 2026

మరోసారి కనిపించిన కిమ్ కుమార్తె.. వారసత్వానికి సంకేతాలా?

image

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ‘కుమ్‌సుసన్’ స్మారకాన్ని సందర్శించి దేశ మాజీ నేతలకు నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా తండ్రితో పాటు అధికారిక కార్యక్రమాల్లో జు యే పాల్గొంటుండటంతో ఆమెను వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇటీవల చైనా పర్యటనలోనూ కనిపించారు.

Similar News

News February 8, 2026

ఉత్తర తెలంగాణలో BJP vs MIM

image

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఆ జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మున్సిపల్, కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని భావిస్తోంది. అయితే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో MIM అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో నిజామాబాద్‌లో 16, కరీంనగర్‌లో 15 డివిజన్లు గెలుచుకున్న MIM.. ఈసారీ మేయర్ ఎంపికలో కీలకంగా మారనుంది.

News February 8, 2026

SECLలో 66 పోస్టులు.. అప్లై చేశారా?

image

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(<>SECL<<>>)లో 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 7వ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మెంటల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ & రీజనింగ్ స్కిల్స్, జనరల్ అవేర్‌నెస్, సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై పరీక్ష ఉంటుంది. వెబ్‌సైట్ :https://secl-cil.in/

News February 8, 2026

జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి వల్ల నష్టాలు

image

జీడిమామిడి తోటల్లో ఈ సమయంలో ‘టీ దోమల’ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి ఒక రకమైన పదార్థాన్ని వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమల నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తర్వాత రెండోసారి, కాయ గోళీ సైజులో ఉన్నప్పుడు మూడోసారి మందులను పిచికారీ చేయాలి.