News January 20, 2026
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మళ్లీ గర్భవతి అయ్యాను. మా ఇల్లు మరింత హాయిగా, సందడిగా మారబోతోంది. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని ప్రియా మోహన్ సైతం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 17, 2026
ఇమ్రాన్ కోసం కపిల్, గవాస్కర్ సహా 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. ఇందులో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85% చూపు కోల్పోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. పాక్‌కు 1992 WC అందించిన ఇమ్రాన్, 2018-2022 మధ్య PMగా ఉన్నారు.
News February 17, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు

<
News February 17, 2026
కుటుంబ కలహాలు తొలగేందుకు పరిహారాలు

కుటుంబంలో ప్రశాంతత కోసం వాస్తు నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. ప్రతికూల శక్తిని పోయేందుకు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కకు నిత్యం నీరు పోయాలి. అదే దిశలో రాగి/ఇత్తడి బిందెతో నీటిని ఉంచాలి. దృష్టి దోషాలు పోవాలంటే దక్షిణాన పంచముఖ ఆంజనేయ ఫోటోను ఉంచాలి. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సానుకూల శక్తితో ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.


