News September 3, 2025
మరోసారి మెదక్ జిల్లాకు రానున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మెదక్ జిల్లాకు రానున్నారు. ఈనెల 4 లేదా 5న భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లా పోచారంలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. పోచారం ప్రాజెక్ట్ పరిశీలించి రోడ్డు మార్గంలో మెదక్ చేరుకుని, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని తెలిసింది. తెగిపోయిన పోచారం బ్రిడ్జి వద్ద రోడ్డును పునరుద్ధరిస్తున్నారు.
Similar News
News September 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 4, 2025
ఇక ఈ కార్లన్నింటిపై 40 శాతం GST

మిడ్ రేంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. 1500cc కెపాసిటీ, 4000mm పొడవు, 170mm గ్రౌండ్ క్లియరెన్స్.. వీటిల్లో ఏది మించినా 40% ట్యాక్స్ పడనుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV), మల్టీ యుటిలిటీ వెహికల్స్(MUV), మల్టీ పర్పస్ వెహికల్స్(MPV) క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్(XUV).. ఏ మోడలైనా పరిమితి దాటితే లగ్జరీ శ్లాబ్ పరిధిలోకి వస్తాయి. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5% శ్లాబులోనే కొనసాగనున్నాయి.
News September 4, 2025
HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.