News February 23, 2026

మరో తేజస్ యుద్ధ విమానానికి ప్రమాదం.. పైలట్ సేఫ్!

image

IAFకు చెందిన తేజస్ యుద్ధ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. శిక్షణలో భాగంగా ల్యాండవుతున్న టైమ్‌లో ఈ ఘటన జరిగింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఎజెక్ట్ అవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఈనెల ఆరంభంలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేజస్ విమానాల్లో ఇది మూడో ప్రమాదం. దీంతో మొత్తం ఫ్లీట్‌పై తనిఖీలు చేపట్టాలని IAF నిర్ణయించింది.

Similar News

News February 27, 2026

చెప్పినట్టే కడిగిన ముత్యంలా బయటికొచ్చా: కవిత

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో క్లీన్‌చిట్ లభించడంపై కవిత హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఈ కేసు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే మోపారని తాను తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ చెప్తూ వస్తున్నట్లు తెలిపారు. ‘కడిగిన ముత్యంలా వస్తానని ముందే చెప్పాను. అదే జరిగింది. కష్టసమయంలో అండగా నిలబడ్డ జాగృతి కార్యకర్తలు, భర్త, అత్తామామలు, కొడుకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.

News February 27, 2026

ప్రధాని మోదీని కలిసిన విజయ్-రష్మిక

image

నూతన దంపతులు విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో మార్చి 4న జరిగే రిసెప్షన్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనకు ప్రత్యేక శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా విరోష్ జంట కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించింది. ఈ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి.

News February 27, 2026

విపక్షాలే టార్గెట్‌గా సీబీ‘ఐ’.. ఆరోపణలకు బలం చేకూరిందా?

image

విపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం CBI, EDలను వాడుకుంటోందనేది ఎంతో మంది ఆరోపణ. అక్రమ కేసుల్లో ఇరికించి నాయకుల క్రెడిబిలిటీని నాశనం చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమన్న విమర్శలున్నాయి. ఈ వాదనలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పుతో బలం చేకూరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాల్లేకుండానే కేసు నమోదు చేసినందుకు CBI అధికారులపైనే విచారణ చేయాలని కోర్టు చెప్పడమే నిదర్శనమంటున్నారు.