News January 2, 2026

మరో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న విశాఖ

image

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News January 2, 2026

ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

image

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News January 2, 2026

AP, TG మధ్య ఉన్న జలవివాదాలు ఏంటి?

image

AP, TG జల <<18742119>>వివాదాలు<<>> దశాబ్దాలుగా ఉన్నాయి. TG విద్యుదుత్పత్తితో శ్రీశైలంలో తమ నీటి వాటా తగ్గుతోందని AP వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి AP ఎక్కువ నీటిని తీసుకుంటోందనేది TG అభ్యంతరం. KWDT-I అవార్డు ప్రకారం AP, TG వాటా 66:34 నిష్పత్తి కాగా తెలంగాణ 50% ఇవ్వాలంటోంది. పాలమూరును AP వ్యతిరేకిస్తోంది. పోలవరం-బనకచర్లకు TG ససేమిరా అంటుండగా గోదావరి మిగులు నీటిపై హక్కు తమదేనని AP వాదిస్తోంది. ఇలా అనేకమున్నాయి.

News January 2, 2026

గ్రోక్ ‘బికినీ’ ట్రెండ్.. మహిళా ఎంపీ ఆందోళన

image

ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ అసభ్యకర ట్రెండింగ్‌పై శివసేన(UBT) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహిళల ఫొటోలను గ్రోక్ ద్వారా అశ్లీలంగా మార్ఫ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ‘X’ సీఈవో మస్క్ కూడా ‘బికినీ’ ట్రెండ్‌ను వైరల్ చేస్తుండటం గమనార్హం.