News August 18, 2025
మరో రెండు రోజులు భారీ వర్షాలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నియోజకవర్గాల అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News August 18, 2025
బాలికను మోసగించిన వ్యక్తికి జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళ పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన పొక్సో కేసులో కొత్తపేటకు చెందిన యువకుడికి ఏడాది జైలు, రూ.1000 ఫైన్‌ను కోర్టు విధించిందని DSP గోవిందరావు తెలిపారు. లక్ష్మణరావు అనే యువకుడు ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక నేరానికి పాల్పడి మోసగించాడన్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.
News August 18, 2025
VZM: ప్రజల నుంచి 27 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 11 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.
News August 18, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సూచించారు. గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్.ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.