News October 14, 2025
మర్కూక్: మాగంటి సునితకు బీఫాం అందజేసిన కేసీఅర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కు ఇచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు.
Similar News
News October 15, 2025
పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణలు!

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఇటీవల ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ముస్లిం దేశాల జోక్యంతో అఫ్గాన్ కాల్పులను తాత్కాలికంగా విరమించుకుంది. అయితే మళ్లీ తాలిబన్ సైన్యం, పాక్ ఆర్మీ మధ్య ఘర్షణలు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారన్న ముందస్తు సమాచారంతో అఫ్గాన్ సైన్యం సరిహద్దులోని పాక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగినట్లు తెలుస్తోంది.
News October 15, 2025
గంభీరావుపేట: ‘ప్రజలకు చేరువగా పోలీస్ విధులు ఉండాలి’

ప్రజలకు చేరువగా పోలీస్ విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. విలేజ్ పోలీస్ అధికారులు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, రౌడీషీటర్లను తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.
News October 15, 2025
KNR: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.