News October 14, 2025

మర్పల్లి: తాగునీటి కోసం హోటల్స్‌కు విద్యార్థులు

image

మర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్యలు అధికారుల కళ్లకు కనిపించడం లేదు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసి నీళ్లు తాగేందుకు రోడ్ల వెంబడి తిరుగుతూ హోటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. టీచర్లు కూడా తమకేమి పట్టనట్లు ఉంటున్నారు. చిన్నారులు రోడ్లపై తిరడం వల్ల ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో మరి. హోటల్ యజమానులు దయతలచకుంటే వారి పరిస్థితి ఏంటి.? ఇప్పటికైనా అధికారులు పట్టించుకుంటారో లేదో.

Similar News

News October 14, 2025

స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయిస్తాం: అరుణ కుమారి

image

రోళ్ల మండలం గిద్దబొమ్మనహళ్లిలో మహిళా సంఘాల సభ్యుల డబ్బును స్వాహా చేసిన యానిమేటర్ తిమ్మరాజు నుంచి రికవరీ చేయిస్తామని డీఆర్డిఏ ప్రాజెక్టు మేనేజర్ అరుణకుమారి తెలిపారు. అందుకు సంబంధించి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. శ్రీనిధి రుణాల వివరాలను పరిశీలించారు. యానిమేటర్ తిమ్మరాజు రూ.2.50 లక్షలు వాడుకున్నట్లు అధికారుల ముందు అంగీకరించారని ఆమె తెలిపారు.

News October 14, 2025

₹212 కోట్లతో అమరావతిలో రాజ్‌భవన్

image

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్‌భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్‌కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.

News October 14, 2025

మంచిర్యాల: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

image

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదు నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.