News February 2, 2025

మర్రిపాడు మండలంలో 14 చిరుత పులులు  

image

మర్రిపాడు మండల అటవీ ప్రాంతంలో 14 చిరుతపులులు ఉన్నాయని ఆత్మకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి ఆర్.శేఖర్ తెలిపారు. మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో చిరుత రోడ్డు దాటే అంతవరకు వాహనాలు నిలిపివేసినట్లు పలువురు తెలిపారు. ఇటీవల ఓ చిరుత సింగనపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News April 24, 2025

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

image

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.

News April 23, 2025

ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

image

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.

News April 23, 2025

నెల్లూరు: రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లాలో అనుమతి లేని రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ గౌడ్ కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లో డీఆర్వో ఉదయభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారన్నారు. బోగస్ ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!