News August 8, 2025
మర్రిపాడు వద్ద ప్రమాదం.. యువకుడి మృతి

బద్వేల్‌కు చెందిన వ్యక్తి మర్రిపాడు వద్ద మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. బద్వేల్‌లోని సుమిత్రా నగర్‌లో ఉండే మహమ్మద్, ఆకాశ్ పిల్లలను స్కూల్‌లో చేర్పించేందుకు బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లారు. తిరిగి బద్వేల్ వస్తుండగా మర్రిపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Similar News
News August 10, 2025
ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం కడపలో వారు మాట్లాడారు. క్రిటికల్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశామన్నారు. 13 చెక్‌పోస్టులు, డ్రోన్లు, వజ్రా వెహికల్స్‌తో భద్రత కల్పించామన్నారు. హింసాత్మక చర్యలపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
News August 10, 2025
కడప: నేటితో ఉప ఎన్నికల ప్రచారం క్లోజ్.!

పులివెందుల, ఒంటిమిట్టలో జరగనున్న ZPTC ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం చేయనున్నారు. సా.5 గంటల తర్వాత స్థానికేతరులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఒంటిమిట్టలో 11, పులివెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
News August 10, 2025
కడప: రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు రద్దు.!

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్టీటీసీ ఉపఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మీకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కావున అర్జీదారులు కలెక్టరేట్‌కు రావద్దని అధికారులు వెల్లడించారు.