News February 12, 2025
మర్రిపాడు వద్ద హైవేపై ఘోర ప్రమాదం.. బాలుడి స్పాట్ డెడ్

మర్రిపాడులోని నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై కస్తూర్బా గాంధీ కళాశాల సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నన్నోరుపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి(16) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 27, 2026
మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News February 27, 2026
నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.