News September 20, 2025

మర్రిపూడిలో భార్యను చంపిన భర్త మృతి

image

మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఈ నెల 13న భార్య జయమ్మను రోకలిబండతో భర్త నారాయణ (50) హత్య చేశారు. అనంతరం తానూ గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై టి.రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. వారికి 25 ఏళ్ల కిందట వివాహం కాగా అనుమానంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భార్యను చంపినట్లు సమాచారం.

Similar News

News September 20, 2025

మర్లపాడుకి ఈ నెల 21న మంత్రుల రాక

image

స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులోఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.

News September 19, 2025

ప్రకాశం నూతన కలెక్టర్ టార్గెట్ ఇదేనా..!

image

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే వెలుగొండ పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన తొలి జిల్లా పర్యటనను వెలుగొండ నుంచి ప్రారంభించడం విశేషం. వెలుగొండకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

News September 19, 2025

మహిళను హింసించిన కేసులో నలుగురికి రిమాండ్

image

తర్లుపాడు మండలం కులుజ్వులపాడులో భర్త భార్యను పందిరి గుంజకు కట్టి బెల్ట్‌తో కొట్టిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పొదిలి CI వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మద్యానికి బానిసైన నిందితుడు డబ్బు కోసం భార్యను కట్టేసి కొట్టాడు. అతనితో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించి ఒంగోలు జైలుకు తరలించారు. తర్లుపాడు SI బ్రహ్మనాయుడిని CI అభినందించారు.