News August 25, 2025
మర్రిపూడి: గ్రామం ఒకటే.. పంచాయతీలు రెండు

మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్‌లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.
Similar News
News August 25, 2025
ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఓ వ్యక్తి తమను మోసంచేసినట్లు పలువురు బాధితులు సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. కొనకనమిట్లలో గల ఒక ప్రైవేటు ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి, రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. 16 నెలలపాటు పనిచేసిన తర్వాత ఉద్యోగం తొలగించారని, ప్రభుత్వ ఉద్యోగమని నమ్మి తాము మోసపోయామని, న్యాయం చేయాలని వారు కోరారు.
News August 25, 2025
రియాజ్ అను నేనుకు.. బాలినేని ఎక్కడ?

ఒంగోలు అర్బన్ అథారిటీ ఛైర్మన్‌గా రియాజ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి TDP ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల జనసేన MLAలు, నాయకులు హాజరయ్యారు. అయితే ఎన్నికల అనంతరం జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గైర్హాజరు కావడం విశేషం. అసలు బాలినేనికి ఆహ్వానం అందిందా లేదా అన్నదే ప్రశ్న. ఇటీవల ఒంగోలులో నిత్యాన్నదానం ప్రారంభిస్తానని ప్రకటించిన బాలినేని కార్యాచరణ ఎవరికీ అంతుచిక్కడంలేదట.
News August 25, 2025
పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలి: కలెక్టర్

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ రామారావు, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరైలతో సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తిపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు.