News December 12, 2025

మలయప్పస్వామి గురించి మీకు తెలుసా?

image

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్ప స్వామిని ఊరేగించారని వార్తల్లో వింటుంటాం. అయితే ఈయన కూడా శ్రీవారే. మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి అన్ని రకాల ఉత్సవాలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలోని మూలమూర్తి స్థిరంగా ఉండగా, భక్తులను కటాక్షించడానికి వారి వద్దకు కదులుతూ వచ్చే స్వామియే మలయప్పస్వామి. మలయప్పకోన అనే ప్రాంతంలో స్వయం వ్యక్తంగా ఈ విగ్రహాలు లభించాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News December 12, 2025

భారత్ ఘన విజయం

image

U-19 ఆసియా కప్‌లో UAEపై టీమ్‌ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. వైభవ్‌ సూర్యవంశీ 171 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UAE 14 ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. అనంతరం ఉద్దిశ్‌ సూరీ(78), పృథ్వీ మధు(50) పోరాడినా ఆ టీమ్ 199/7 రన్స్‌కే పరిమితమైంది.

News December 12, 2025

ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.

News December 12, 2025

రెండో విడత ప్రచారానికి తెర

image

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.