News January 9, 2026

మలేషియా ఓపెన్‌.. సెమీస్‌కు పీవీ సింధు

image

మలేషియా ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్ షట్లర్, థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఫస్ట్ గేమ్‌ను ఆమె 21-11 తేడాతో గెలిచారు. అనంతరం మోకాలి గాయం కారణంగా యమగూచి గేమ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దీంతో సింధు సెమీస్‌కు చేరుకున్నారు.

Similar News

News February 14, 2026

బిల్ గేట్స్‌ను మూడుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం

image

AP: మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనను మూడుసార్లు APకి తీసుకొచ్చిన ఘనత తనదేనని ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామన్నారు. కాగా ఈ స్కీమ్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది.

News February 14, 2026

సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

image

T20WC: అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 175-7 స్కోర్ చేసింది. చాప్‌మన్ 48, మిచెల్ 32, అలెన్ 31 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ జాన్సెన్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కి చేరువ కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

News February 14, 2026

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి: CM రేవంత్

image

TG: మున్సిపల్ ఫలితాలపై మంత్రులతో CM రేవంత్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నికైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులకు స్పష్టం చేశారు.