News August 9, 2025

మల్కంచెరువు వద్ద హైడ్రా కమిషనర్ పరిశీలన

image

మల్కం చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు. వరద ముంచెత్తడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్ద మొత్తంలో ఉండి, బయటకు వెళ్లే ఔట్ ఫ్లో ఆ స్థాయిలో లేకపోవడంతో సమస్య తలెత్తుతుందని అధికారులు తెలిపారు. మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైడ్రా కమిషనర్ సూచించారు.

Similar News

News August 9, 2025

శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండొద్దు: కలెక్టర్

image

శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఎవరు ఉండవద్దని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 5, 2025

బాలాపూర్: 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీ: మంత్రి

image

బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, రంగారెడ్డి జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు.

News August 5, 2025

HYD: కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన కర్ణన్

image

నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వాటర్ లాగింగ్స్, కూలిన చెట్లకు సంబంధించి అందిన ఫిర్యాదుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ లాగింగ్స్‌కు సంబంధించిన 164 ఫిర్యాదుల అందినట్లు ఆయన వివరించారు.