News November 3, 2025

మల్కపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలు విడుదల

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రారంభించారు. కులవృత్తుల అభ్యున్నతి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News November 3, 2025

చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

image

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్‌ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్‌, ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.

News November 3, 2025

బస్సుల్లో ఈ నియమాలు తప్పనిసరి: ఆర్టీఓ మురళి మోహన్

image

1.⁠ ⁠ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు (అత్యవసర నిష్క్రమణ)
2.⁠ ⁠ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం
3.⁠ ⁠ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం.
4.⁠ ⁠ఫైర్ extinguishers
5.⁠ ⁠డైమండ్ టైప్ హామర్స్
6.⁠ ⁠కోచ్ సక్రమ లేఅవుట్.

News November 3, 2025

హనుమకొండ: 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్ వి.బి. నిర్మలా గీతాంబ తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్‌ఫండ్, క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ కేసులు పరిష్కారానికి అవకాశం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులు, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.