News April 25, 2024
మల్కాజిగిరి BRS అభ్యర్థి ఆస్తులు రూ.82.54 కోట్లు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు రూ.82.54 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.62.12 కోట్లు, చరాస్తులు రూ.20.42 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అప్పులు రూ.10.20 కోట్లు, ప్రస్తుతం నగదు రూ.5.70 లక్షల ఉండగా.. బంగారం 2,000 గ్రాములు, వెండి 4 కిలోలు, ఒక డైమండ్ ఉన్నట్లు తెలిపారు.
Similar News
News January 1, 2026
RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.
News December 31, 2025
HYD: వినూత్నంగా సజ్జనార్ న్యూ ఇయర్ విషెస్

న్యూ ఇయర్ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే మద్యం బాబులకు హితవు పలికారు. పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్లో 35 దాటితే బుక్కయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఒక ఏడాదే వృథా అవుతుంది కానీ డ్రైవింగ్‌లో తేడా కొడితే జీవితమే ఆగం అవుతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా, జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.
News December 29, 2025
రంగారెడ్డి జిల్లాలో మరోసారి ఎన్నికలు!

RRలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు నోటిఫికేషన్ వెల్లడైంది.
అమనగల్లు: వార్డులు 15, జనాభా 19,874
చేవెళ్ల: వార్డులు 18, జనాభా 22,713
ఇబ్రహీంపట్నం: వార్డులు 24, జనాభా 30,993
మొయినాబాద్: వార్డులు26, జనాభా 28,196
షాద్‌నగర్: వార్డులు 28, జనాభా 54,431
శంకర్‌పల్లి: వార్డులు 15, జనాభా 20,789


