News October 3, 2025
మల్కాజ్గిరి: అంగన్వాడీ టీచర్ల చీరల పంపిణీ ఇంకెప్పుడు.?

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లా పరిధిలోని సిబ్బందికి పంపిణీ చేయలేదు. డ్రెస్ కోడ్ సంబంధించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. చీరల పంపిణీ వేగవంతం చేయాలని, అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు.
Similar News
News October 3, 2025
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రకాశం SP

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించి, పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని పూర్తి విభాగాలను రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రికార్డులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేయాలని సూచించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలన్నారు.
News October 3, 2025
జిల్లాలో 210 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, ఇంకా 210 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. యూరియా అవసరమైన రైతులు తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 342 మెట్రిక్ టన్నుల యూరియాను 3,753 మంది రైతులకు పంపిణీ చేసినట్లు వివరించారు.
News October 3, 2025
మధ్యప్రదేశ్‌లో ‘టమాటా వైరస్’ కలకలం

MPలోని భోపాల్‌లో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. 200 మంది స్కూల్ విద్యార్థులు దీని బారినపడ్డారు. ఈ వైరస్ సోకినవారు చేతులు, కాళ్లు, అరికాళ్లు, మెడ కింద తీవ్రమైన దురదతో బాధపడుతున్నారు. దద్దుర్లు తర్వాత పొక్కులుగా మారుతున్నాయి. ఒళ్లంతా మంట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది సులభంగా సోకుతోందని, బాత్రూమ్ వెళ్లినపుడు చేతులు సరిగ్గా కడుక్కోవాలని అధికారులు సూచించారు.