News April 15, 2025

మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Similar News

News April 17, 2025

విశాఖ: తీవ్రంగా గాయపడిన నాగరాజు మృతి

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జల్లూరు నాగరాజు (58) KGHలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రమాదకరమైన బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 17, 2025

గాజువాక యువకుడిని కాపాడిన పోలీసులు

image

గాజువాకకు చెందిన సన్యాసినాయుడు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసినాయుడు రాజమండ్రిలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నాడు. కాగా బెట్టింగులకు బానిసై రూ.50వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. అది గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని కాపాడారు.

News April 17, 2025

విశాఖలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్

image

విశాఖలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగటి పూటే ఇంట్లోకి చొరబడి దొచుకుంటున్నారు. మద్దిలపాలెంలో మంగళవారం సాయంత్రం అద్దె ఇంటికోసం అని వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన మర్చిపోకముందే MVP కాలనీలో బుధవారం సాయంత్రం మరో ఘటన జరిగింది. MVP సెక్టార్-8లో లలిత అనే వృద్ధురాలి మెడలో గొలుసు తెంపుకొని ఓ దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!