News April 15, 2025

మల్కాపురం: బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News April 17, 2025

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 1606 దరఖాస్తులు: జేసీ 

image

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఆన్ లైన్‌లో 1606 దరఖాస్తులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. దరఖాస్తులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉందని అన్నారు. 2019 అక్టోబర్ 15కి ముందు ఉన్న ఆక్రమణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తుదారులు.. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, నీటి చార్జీ రసీదులను సమర్పించాలన్నారు.

News April 16, 2025

కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించనున్న విశాఖ ఎంపీ 

image

డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం విశాఖ కలెక్టర్ ఆఫీసులో గురువారం జరగనుందని దిశా కన్వీనర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ సమీక్షిస్తారని వెల్లడించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని కోరారు.

News April 16, 2025

చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలించిన విశాఖ సీపీ 

image

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం పర్యవేక్షించారు. గోశాల జంక్షన్ వద్ద పార్కింగ్, ఘాట్ రోడ్లో మలుపులు, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో స్టాప్ బోర్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు విశాలంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!