News April 24, 2025
మల్యాలలో భూభారతి అవగాహన సదస్సు

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం: కలెక్టర్

గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
News April 24, 2025
ఉగ్రదాడి: అఖిలపక్ష సమావేశం ప్రారంభం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది. ఇందులో కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, నిర్మల, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రులు ఆ సమావేశంలో వివరిస్తున్నారు.
News April 24, 2025
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ ఛాన్సలర్‌గా చంద్రశేఖర్

ప్రముఖ కార్డియాలజిస్ట్ పుల్లల చంద్రశేఖర్ MD. DM. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్సెస్ విజయవాడ వైస్ ఛాన్సలర్‌గా గురువారం నియమితులయ్యారు. ఈయన పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన కార్డియాలజీ సామాజిక రంగంలో విశేష సేవలు అందించారు. ప్రభుత్వ వైద్యుడిగా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎంతో మందికి కార్డియాలజీ పేషెంట్‌లకు ప్రాణం పోశారన్నారు.