News April 24, 2024

మల్లన్నను దర్శించుకున్న నారా చంద్రబాబు దంపతులు

image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయండి: ఎస్పీ

image

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెంచి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేర నియంత్రణకు మరింత పటిష్ఠంగా పనిచేయాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 25, 2026

ఇంటర్ పరీక్షలకు 852 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.