News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
Similar News
News February 22, 2025
తిరుపతి జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్: తిరుపతి JC
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ ఏర్పేడు: IIT లో సందడి చేసిన తమన్
✒ చంద్రగిరి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ అమ్మాయి న్యూడ్ ఫొటోలతో తిరుపతి యువకుడి వ్యాపారం
✒ ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం (వీడియో)
News February 22, 2025
విశాఖ నుంచి శ్రీశైలంకు అదనంగా బస్సులు

శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సునకు అదనంగా బస్సులు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 25న విశాఖ నుంచి శ్రీశైలంకు మధ్యాహ్నం 2గంటలకు సూపర్ లగ్జరీ బస్సును సాధారణ బస్సు చార్జితో (రూ.1230/- లు) ద్వారకా బస్సు స్టేషన్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 22, 2025
నెల్లూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: నెల్లూరు కలెక్టర్
✒ త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు: మంత్రి నాదెండ్ల
✒ కందుకూరు: RTCబస్‌లోనే అనంత లోకాలకు
✒ నెల్లూరులో 40 కిలోల వెండి స్వాధీనం
✒ బుచ్చి గోదాములో మంత్రుల తనిఖీలు
✒ నెల్లూరు: మహిళా అధికారుల ఫైట్ (వీడియో)
✒ నెల్లూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక
✒ కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు
✒ నెల్లూరు: వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు