News October 22, 2025

మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం

image

కార్తీక మాసం తొలిరోజు శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లలో దర్శనానికి వెళ్లేందుకు సుమారు 3 గంటలకుపైగా సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అయ్యప్ప దీక్ష దారులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.

Similar News

News October 22, 2025

ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి: కొలుసు

image

AP: పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50% ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు వచ్చేనెల 5 వరకు సర్వే నిర్వహిస్తామని, ఇళ్లు లేనివారు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.28లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. 16నెలల్లోనే రూ.7.65లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

News October 22, 2025

ములుగు: ‘డీసీసీ’ పీఠంపై అదే ఉత్కంఠ..!

image

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ప్రకటన వెలువడే అవకాశముంది. ఆరుగురు సీనియర్ నాయకులు ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజ్ చేసిన ప్రకటన ఆలోచనలో పడేసింది. ఆ ఆరుగురు అధిష్ఠానం కరుణకోసం తీవ్రంగా తండ్లాడుతున్నారు.

News October 22, 2025

స్థానిక ఎన్నికలపై రేపే తుది నిర్ణయం?

image

TG: స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది. పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ వెళ్లాలా? లేదా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా? అనేదానిపై CM రేవంత్ అధ్యక్షతన మ.3 గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. పాత పద్ధతినే అవలంబిస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారముంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.