News March 31, 2024
మల్లాపూర్: ఉరేసుకుని వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 1, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్.. కరీంనగర్ జిల్లాలో 60 కేంద్రాలు

రేపటి నుంచి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 17,257 మంది విద్యార్థుల కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు RIO వి.గంగాధర్ తెలిపారు. హాల్ టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని హైదరాబాద్ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు.
News February 1, 2026
ప్రజావాణి రద్దు: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News January 31, 2026
కరీంనగర్ కార్పొరేషన్‌లో త్రిముఖ పోటీ తప్పదా..!

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 1257 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థులు 374, బీజేపీ అభ్యర్థులు 309, కాంగ్రెస్ నుంచి 252 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి సైతం 55 మంది దరఖాస్తులు చేయగా వైసీపీ నుంచి పోటీలో ఎవరు నిలవలేదు. 93 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.


