News November 27, 2025

మల్లాపూర్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి, సాతారం, మొగిలిపేట, రాఘవపేట, కుస్తాపూర్, కొత్త దామరాజ్ పల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. నోటీస్ బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.

Similar News

News November 27, 2025

MHBD జిల్లాలో సర్పంచ్, వార్డులకు నామినేషన్ల వివరాలు ఇలా..!

image

MHBD జిల్లాలో తొలి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచి స్థానాలకు 105, వార్డుల మెంబర్ స్థానాలకు 41 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. సర్పంచ్ స్థానాలు గూడూరు-28, ఇనుగుర్తి-14 కేసముద్రం-21, MHBD-20, నెల్లికుదురు-22 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్ల స్థానాలకు గూడూరు-18, ఇనుగుర్తి-5, కేసముద్రం-4, MHBD-12, నెల్లికుదురు-2 వార్డుల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 27, 2025

సంగారెడ్డి: నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

image

ఏడు మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

News November 27, 2025

వేములవాడ: ‘ఆగిపోయిన రోడ్డు పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తాం’

image

వేములవాడలో ఆగిపోయిన 4 లేన్ల రోడ్డు పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామని R&B DE శాంతయ్య తెలిపారు. రూ. 9.65 కోట్ల అంచనా వ్యయంతో 2022-2023లో ప్రారంభించి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను గురువారం పున ప్రారంభించారు. చెక్కపల్లి బస్టాండ్ నుంచి కోరుట్ల బస్టాండ్ వరకు 600 మీటర్లు, రాజన్న ఆలయం ముందువైపు మెట్ల నుంచి జగిత్యాల కమాన్ వరకు 700 మీటర్లు డివైడర్‌తో కూడిన 4 లేన్ల రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.