News February 25, 2025
మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News February 25, 2025
వీసీలకు బెదిరింపులంటూ వైసీపీ ‘ట్రూత్ బాంబ్’ పోస్ట్

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్‌పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.
News February 25, 2025
కోయ భాషలో పెళ్లి పత్రిక.. వైరల్

తమ మాతృ భాష ‘కోయ’పై ఉన్న ప్రేమను ఓ జంట వినూత్నంగా చాటింది. పెళ్లి శుభలేఖను కోయ భాషలో ముద్రించిన ఫొటో వైరలవుతోంది. పెళ్లి పిలుపును జోడ, వరుడిని పేకల్, వధువును కోకాడ్, భోజనాన్ని పెళ్లి బంతి అని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రాంతాల, వ్యక్తుల పేర్లు మినహా పత్రిక అంతా కోయ భాషలోనే ఉండటం విశేషం.
News February 25, 2025
APPLY NOW.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

215 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల భర్తీకి అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MAR 22 వరకు అప్లై చేసుకోవచ్చు. APR 4వ వారంలో ర్యాలీ ఉంటుంది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలుండగా, పోస్టుల వారీగా 18-30 ఏళ్లలోపు వారు అర్హులు. PST, PET, రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టుల తర్వాత ఎంపిక ఉంటుంది. ఫీజు OC, OBC, EWSలకు ₹100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <