News April 5, 2024
మల్లాపూర్: ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడి
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 25, 2024
KNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి KNRజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి KNR, JGTL, SRCL, PDPL జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News December 25, 2024
హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం
ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.
News December 25, 2024
KNR: భూమి లేని పేదలను గుర్తించేదెలా!
భూమిలేని పేదలకు ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. తొలి విడతగా ఈనెల 28న రూ.6 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఉపాధి హామీ జాబ్ కార్డు దారుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,52,932 కార్డుదారులు ఉన్నారు. వీరిలో భూమి ఉన్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ఆధారంగా చేస్తారా? లేక రైతు భరోసా ఆధారంగా ఎంపిక చేస్తారా! అనేది సందేహంగా మారింది.