News November 15, 2025

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల తర్వాత నీటి తడులు – జాగ్రత్తలు

image

మల్లె మొక్క కొమ్మల కత్తిరింపు తర్వాత మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో అధిక నీటిని అందిస్తే మొక్కల వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే నేల మరీ తడిగా, నీరు నేలపై నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒక వేలిని నేలలో 2-3 అంగుళాల లోతు వరకు పెట్టి నేల ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. మొక్క నుంచి కొత్త చిగురు, మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

Similar News

News November 15, 2025

దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

image

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్‌లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.

News November 15, 2025

ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి చేశారు: చాందిని చౌదరి

image

కెరీర్ ప్రారంభంలో ఓ మూవీలో ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి తెచ్చారని హీరోయిన్ చాందిని చౌదరి అన్నారు. ‘కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఆ సమయంలో అర్జున్‌రెడ్డి సినిమా విడుదలై హిట్ అయింది. దీంతో మా సినిమాలోనూ కిస్ సీన్లు పెడితే హిట్ అవుతుందని అనుకున్నారు. దర్శకుడు చెప్పినట్టు చేయకపోతే చెడ్డపేరు వస్తుంది. అయితే, హీరో చేయనని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాను’ అని చెప్పారు.

News November 15, 2025

HOCLలో 72 పోస్టులు

image

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ (HOCL)72 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.hoclindia.com/