News January 19, 2026

మళ్లీ నేల చూపులే.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 615 పాయింట్లు కోల్పోయి 82,955 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయి 25,512 వద్ద కొనసాగుతున్నాయి. ICICI బ్యాంక్(3.45%), రిలయన్స్(2.3%), ఇన్ఫోసిస్(1.18%) నష్టపోగా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(3.73%), TECHM(3.66%), మారుతీ సుజుకీ(1.3%) లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మార్కెట్లపై పడిందని ఎక్స్‌పర్టులు అంటున్నారు.

Similar News

News February 19, 2026

అణు ఆస్తుల రక్షణకు ఇరాన్ ‘మాస్టర్ ప్లాన్’!

image

అమెరికా మిలిటరీ ప్రెజర్ పెరగడంతో ఇరాన్ తన అణు కేంద్రాలను భూగర్భ కోటల్లా మార్చేస్తోంది. పర్చిన్‌లోని ‘తలేఘన్-2’ కేంద్రాన్ని కాంక్రీట్ షెల్స్, మట్టితో కప్పేసి కనిపించకుండా బంకర్‌లా మారుస్తున్నట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. నతాంజ్, ఇస్ఫాహన్ ప్రాంతాల్లోని టన్నెల్ ఎంట్రన్స్‌లనూ మట్టితో పూడ్చేస్తున్నారు. ఓవైపు చర్చలు జరుగుతున్నా అటాక్ జరిగితే అణు ఆస్తులు సేఫ్‌గా ఉండేలా ఇరాన్ ప్లాన్ చేస్తోంది.

News February 19, 2026

టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్

image

T20WCలో భారత జట్టు ఫీల్డింగ్ తేలిపోయింది. ఆడిన 4 మ్యాచుల్లో 9 క్యాచులు వదిలేసింది. టోర్నీలో ఆడుతున్న 20 జట్లలో ఐర్లాండ్(10) తర్వాత టీమ్ఇండియా రెండో స్థానంలో ఉందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్ట్రాంగ్‌గా ఉండటంతో 4 మ్యాచుల్లోనూ భారత్ గెలిచింది. నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఫీల్డింగ్ విభాగంపై దృష్టిసారించాల్సి ఉందని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

News February 19, 2026

ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ స్పీచ్ రద్దు

image

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్‌ ‌గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో బిల్‌ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.