News April 16, 2024
మళ్లీ BRSలో చేరిన జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్

ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ తోపాటు పలువురు నాయకులు తిరిగి మంగళవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు సొంతగూటికి చేరుకున్నారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్లనే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కేటీఆర్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Similar News
News April 23, 2025
విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: SP

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.
News April 23, 2025
ఆదిలాబాద్: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News April 22, 2025
ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.